‘తీగలనాగారం’ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం

‘తీగలనాగారం’ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం

అమీన్​పూర్, వెలుగు: బీరంగూడ డివిజన్ పటేల్ గూడ పరిధిలోని తీగలనాగారం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. చెరువు చుట్టూ రూ.1.30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఫెన్సింగ్ పనులకు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఇప్పటికే బండ్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. మాజీ ఎంపీపీ దేవానంద్​, హెచ్ఎండబ్ల్యూఎస్ ఇరిగేషన్ ఈఈ మల్లేశ్, డీఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర పెరగాలి 

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర పెరగాలని ఎమ్మెల్మే గూడెం మహిపాల్​రెడ్డి అన్నారు. అమీన్​పూర్ జడ్పీ హైస్కూల్​లో క్షత్రియ యూత్​ఫెడరేషన్​ ఆధ్వర్యంలో బుధవారం పదోతరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి అందజేశారు. మున్సిపల్​మాజీ వైస్ చైర్​పర్సన్​నరసింహగౌడ్, హెచ్ఎం సోమ్లనాయక్, క్షత్రియ యూత్ ఫెడరేషన్ ప్రతినిధులు రాజు, ప్రశాంత్​వర్మ, రాము, రామరాజు, కేవీఎస్ఎన్.రాజు పాల్గొన్నారు. అనంతరం పటాన్​చెరు డివిజన్​పరిధిలోని నందన్ ​ప్యారడైజ్ కాలనీలో రూ.1.35 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే అండర్ గ్రౌండ్​డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.  

విద్యుత్, తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వండి  

పటాన్​చెరు, అమీన్​పూర్ జీహెచ్ఎంసీ సర్కిళ్ల పరిధిలోని ప్రతీ కాలనీలో విద్యుత్, తాగునీరు, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆదేశించారు. బుధవారం పటాన్​చెరులోని క్యాంప్ ​ఆఫీస్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే వేసవికి అనుగుణంగా నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. విద్యుత్ కోతలు ఉండొద్దన్నారు. ప్రతీ కాలనీలో రోడ్లను శుభ్రం చేయించాలని చెప్పారు. ప్రభుత్వ అనుమతి లేని హోర్డింగులను తొలగించాలని చెప్పారు.