ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ : ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ : ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్

మహబూబాబాద్, వెలుగు: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్​ ప్రభుత్వం పని చేస్తున్నదని ప్రభుత్వ విప్, డోర్నకల్​ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్​ కలెక్టరేట్​లో నిర్వహించిన 79 వ స్వాతంత్ర వేడుకలకు ఆయన హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 588 రేషన్ షాపుల ద్వారా 2.43వేల కార్డుదారులకు మూడు నెలల కోటా 144,14,034 మెట్రిక్​ టన్నులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 

జిల్లాలో వివిధ రంగాల్లో డెవలప్​మెంట్​ప్రోగ్రామ్స్​ విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు.  అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. అంతకుముందు కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా ఇన్​చార్జి కలెక్టర్ లెనిన్​వత్సల్​టొప్పో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్​రావు, ఎస్పీ సుధీర్ రామ్​నాథ్​ కేకన్, అడిషనల్​కలెక్టర్​ అనిల్​ కుమార్, వివిధ శాఖల ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.