V6 News

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్ ఘనపూర్, వెలుగు: రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం స్టేషన్ ఘనపూర్ మండలం పామునూర్, చిల్పూర్ మండలం రాజవరం, చిన్నపెండ్యాల గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.​ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని మెజార్టీ కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకే కేటాయించినట్లు తెలిపారు.