భర్తీ చేసిన ఉద్యోగాలను లెక్కలతో సహా చూపిస్తాం : కవిత

భర్తీ చేసిన ఉద్యోగాలను లెక్కలతో సహా చూపిస్తాం : కవిత

రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాలను మొత్తం లెక్కలతో సహా చూపిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.  విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ నోటిఫికేషన్ లు ఇస్తున్నారని ఆమె చెప్పారు. ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. కేంద్రంలో 10 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పిన కవిత .. వాటిని భర్తీ చేస్తే రాష్ట్రంలో కనీసం రెండు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. లాంగ్ జంప్, షార్ట్ పుట్ లో కొన్ని సంస్థలు, ప్రతిపక్షాలు అభ్యర్థులను రోడ్డు మీదకు తీసుకొచ్చి ఆందోళనలు చేపిస్తున్నరని కవిత ఆరోపించారు. కావాలని పిల్లల్ని రెచ్చగొడుతూ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.  ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళ్తోందని ఆమె  చెప్పారు. విభజన తర్వాత  రాష్ట్రం అనేక రంగాల్లో ముందుకెళ్తోందని కవిత అన్నారు.