V6 News

ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించండి : పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించండి : పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బీహెచ్ఈఎల్​ యాజమాన్యం సహకరించాలని, ఈ బెల్‌‌‌‌‌‌‌‌ భూముల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందని పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించారు. రామచంద్రాపురం పరిధిలో పెండింగ్ సమస్యలపై భెల్​ ఈడీ వై. శ్రీనివాస రావు, ఏజీఎం సురన్​ప్రసాద్, అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. 

పలు సమస్యలపై చర్చిస్తూ ఈఎస్ఐ చర్చి సమీపంలో భెల్‌‌‌‌‌‌‌‌ పరిశ్రమ భూమిలో ఉందంటూ బీరప్ప గుడిని తొలగించారన్నారు. భెల్​ ఏర్పడక ముందు నుంచి అక్కడ గుడి ఉందని అధికారులకు వివరించారు. రాయసముద్రం చెరువు సుందరీకరణకు బీహెచ్ఈఎల్ మేనేజ్​మెంట్ అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.