ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.700 కోట్లతో భారీగా రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
పోచారం గ్రామానికి రూ.9.24 కోట్లు కేటాయించి సీసీ రోడ్లు, ఇండ్లు, గృహజ్యోతి పథకం అమలు వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పేదవారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
