
- ఎవరు అడ్డుకున్నా.. ఫార్మాసిటీ ఆగదు
- త్వరలోనే ఆ భూముల్లో కంచెలు పాతుతాం: ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా: ఫార్మాసిటీ ఆగేది కాదని, గతంలో రైతులే కాన్సెన్ట్ ఇచ్చారని, నష్టపరిహారం తీసుకొని మాటమార్చడం తగదని అన్నారు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం మేడపల్లిలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పర్యటించారుజ. ఉద్రిక్తత నెలకొంది. మేడిపల్లి గ్రామంలో చెరువు నిండటంతో పూజలు చేసేందుకు వచ్చిన ఆయన్ను స్థానికులు నిలదీసే ప్రయత్నం చేశారు. ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతే పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపారు.
కిషన్ రెడ్డి కాన్వాయ్ గా వెళ్తుండగా గ్రామస్థులు, టీఆర్ఎస్ శ్రేణులు చెప్పులు రాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో రెండు కార్ల అద్దాలు ద్వయంసం అయ్యాయి. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టేక్రమంలో ఒక రైతు గాయం కాగా సొమ్మసిల్లిపడిపోయాడు. ఫార్మతో భూములు కోల్పోతుంటే పరమర్శించంకుండా బెదిరింపులకు పాల్పడిన ఎమ్మెల్యే ఏ ముఖంతో గ్రామంలోకి వచ్చాదో చెప్పాలంటూ ,ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ గ్రామస్తులు, రైతులు నినాదాలు చేశారు.
నానక్ నగర్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫార్మాకు కేంద్రమే అనుమతిచ్చిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఇంకొందరు రాజకీయ లబ్ది కోసం ఏవేవో కార్యక్రమాలు చేస్తే ఫార్మా ఆగదన్నారు. ఒకవేళ అపాలనుకుంటే బీజేపీయే కేంద్రంలో ఉందని, అక్కడకే ఉత్తరాలు రాయాలన్నారు. ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములకు త్వరలోనే కంచెలు పాతుతారన్నారు.