దళితులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

దళితులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 
  •     ‘శుద్ధి’ ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
  •     సైఫాబాద్ పోలీస్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే మేడిపల్లి ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజపూర్ గ్రామంలో దళితులను అవమానించే రీతిలో నేల మైలపడిందని, పసుపునీళ్లతో శుద్ధిచేసిన ఘటనపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ కుల వివక్షయేనని, దీనికి బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని బుధవారం సైఫాబాద్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ ను అవమానించారని దళితులు దండోరా కార్యక్రమం చేపడితే.. కేసీఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్లే దారి మైలపడిందని, పసుపు నీళ్లతో శుద్ధి చేయడం, బీఆర్ఎస్ నాయకుల పనే అని, దీనికి కేసీఆర్ బాధ్యతవహించి దళితులకు క్షమాపణలు చెప్పాలని ఎమ్యెల్యే డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తీరు దళిత వ్యతిరేకి పార్టీగా ఉందని, అధికారంలో ఉన్నప్పుడు దళితులపై తీవ్ర వివక్ష చూపిన ఆ పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండికూడా దళితులను అవమానిస్తున్నదని, ఈ విషయంలో కేసీఆర్ పూర్తి బాధ్యత తీసుకొని రాష్ట్రంలోని దళిత జాతికి బహిరంగ క్షమాపణ  చెప్పాలని  ఎమ్మెల్యే సత్యం డిమాండ్ చేశారు.