కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట

కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట

చొప్పదండి, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వంలో అన్నిరంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని కరీంనగర్​ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గురువారం చొప్పదండి మండలం రుక్మాపూర్​లో స్వశక్తి మహిళా సంఘాల నూతన భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో రుక్మాపూర్ సర్పంచ్ కర్రె ప్రేమలత, పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,  లీడర్లు పాల్గొన్నారు.

ఫ్లడ్​ కెనాల్​కు నీరు విడుదల చేయాలని వినతి 

బోయినిపల్లి, వెలుగు:  రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని వరద కాలువకు నీటిని విడుదల చేయాలని కోరుతూ విలాసాగర్ రైతులు గురువారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కోరారు. వరద కాలువలో నీరు లేక పంటలు ఎండిపోయే స్థితికి వచ్చాయన్నారు. స్పందించిన ఎమ్మెల్యే ఎల్లంపల్లి ఈఈ సత్యనారాయణతో ఫోన్​లో మాట్లాడి వరద కాలువకు నీటిని విడుదల చేయాలని సూచించారు. అంతకుముందు బోయినిపల్లి మండల కాంగ్రెస్ లీడర్లు ఎమ్మెల్యేను కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.