చొప్పదండి, వెలుగు: స్టూడెంట్స్ ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. చొప్పదండి పట్టణంలోని సిద్ధార్థ హైస్కూల్‌లో విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన స్కూల్ వార్షికోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు.
30 ఏండ్లుగా సిద్ధార్థ విద్యాసంస్థలు విద్యారంగానికి అందిస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. స్టూడెంట్స్ చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్ పర్సన్ మానస, డైరెక్టర్ దాసరి స్వప్న, పాల్గొన్నారు.
