- బాల్క సుమన్‌పై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపాటు
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ రాసిచ్చిన అబద్ధాల స్క్రిప్టునే బాల్క సుమన్ చదువుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ అయ్యారు. సోమవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన పదేండ్లలో ఉద్యోగాలు భర్తీ కాలేదని, సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకటించారని గుర్తుచేశారు.
ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కూడా కాకముందే బీఆర్ఎస్ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు భయపడి పదేండ్లపాటు బాల్క సుమన్ ఉస్మానియా యూనివర్సిటీకి పోలేదని, సీఎం రేవంత్‌పై చేసిన కామెంట్లను వాపస్ తీస్కోకపోతే స్టూడెంట్ల చేతిలో దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు. టీఎస్పీఎస్సీ అప్పుడు అంగడి సంస్థలాగా నడిచిందన్నారు.
