
ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయి రెడ్డి నియామకం రద్దయిన తర్వాత ఆయన స్థానంలో మోదుగుల వేణు గోపాల్ రెడ్డి నియమించనున్నట్లు సమాచారం. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని మొదట ఢిల్లీ ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన నియామక ఉత్తర్వులను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆయన స్థానంలో మాజీ ఎంపీ, నర్సరావు పేట ఎమ్మెల్యే మోదుగుల వేణు గోపాల రెడ్డిని ప్రభుత్వం నియమించనున్నట్లు తెలిసింది.