మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తోందని, ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సమన్వయంతో ముందుకెళ్లాలని మెదక్ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.
గురువారం మెదక్ కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో ‘ప్రజా పాలనా–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మున్సిపల్‌చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, సర్పంచులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్‌తో కలిసి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం శ్రమిస్తున్నట్లు తెలిపారు.
