
హనుమకొండ: గాంధీ భవన్ ను కూలగొడతామని బీఆర్ఎస్ లీడర్లు మాట్లాడుతున్నారని దాని గడప కూడా దాటలేరని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీసుకు ఇంటి నెంబర్ లేకుండానే విద్యుత్ శాఖ మీటర్ కేటాయించిందని, వినియోగదారుడు, తండ్రి పేరు బీఆర్ఎస్ పేరుతో విద్యుత్ మీటర్ తీసుకున్నారని ఆయన వెల్లడించారు.
క్యాంప్ ఆఫీస్ పక్కన స్థలాన్ని కబ్జా చేసి అనుమతులు లేకుండానే అక్రమంగా బీఆర్ఎస్ జిల్లా ఆఫీసును కట్టారని తెలిపారు. పార్క్ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలపై రౌడీ షీట్ ఓపెన్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయం వదిలినా బీఆర్ఎస్ నేతల పాపాలను వదలనని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల అక్రమాల ఎపిసోడ్లను ఒక్కొక్కటి బయటకు తీస్తానని చెప్పారు. పార్టీ ఆఫీస్ లకు భూమి కేటాయించడంపై తమకు అభ్యంతరం లేదన్నారు.