మంత్రిపై చర్యలు తీసుకోకుంటే హైకోర్టులో పిల్ వేస్తా

మంత్రిపై చర్యలు తీసుకోకుంటే హైకోర్టులో పిల్ వేస్తా

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన ఆయనపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బాధ్యత కలిగిన మంత్రి పీఎస్వో దగ్గర గన్ తీసుకుని కాల్చటం చట్ట విరుద్ధమని రఘునందన్ అన్నారు. గన్ సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ కు ఎందుకు పంపలేదన్న రఘునందన్.. శ్రీనివాస్ గౌడ్ పై ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని అన్నారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే శ్రీనివాస్ గౌడ్ను పదవి నుంచి తప్పించాలని.. మంత్రి మీద నమ్మకం ఉంటే రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

డీజీపీ తీరుపైనా రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్ అయిన తర్వాత వచ్చే ప్రభుత్వ సలహాదారు పదవి కోసం ఆశపడి ఆయన మౌనంగా ఉండటం సరికాదని హితవు పలికారు. ఒకవేళ డీజీపీ మంత్రిపై చర్యలు తీసుకోకుంటే తానే హైకోర్టులో పిల్ వేస్తానని  రఘునందన్ రావు  స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తికి వెపన్ తుపాకీ ఇచ్చి కాల్చమనే అధికారం ఎస్పీ సహా ఎవరకీ లేదని, ఒకవేళ ఒకవేళ ఎస్పీ గన్ ఇచ్చుంటే ఆయనను కూడా నిందితునిగా చేర్చాలనిడిమాండ్ చేశారు. గన్లో రబ్బరు బుల్లెట్లు ఉన్నాయన్న వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. గన్మెన్ల తుపాకుల్లో రబ్బరు బుల్లెట్లు ఉంటాయా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్న తప్పులన్నీ తెలిసినా.. డీజీపీ మహేందర్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు.