
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఫెన్సింగ్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్‌గా మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు అసోసియేషన్ ప్రెసిడెంట్ గుత్తా జ్వాల నేతృత్వంలో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. చైర్మన్‌గా సి. లడ్డు యాదవ్, వైస్ ప్రెసిడెంట్‌గా ఈశ్వర్, చీఫ్ అడ్వైజర్‌గా ఎం. మహేందర్ రెడ్డిని ఎంపిక చేసింది. లీగల్ అడ్వైజర్‌గా శివ్ శంకర్‌తో పాటు హరీశ్, నర్సింగ్ రావు, కరుణ సాగర్, విద్యా సాగర్, పరమేశ్‌ను ప్యాట్రన్స్‌గా ప్రకటించింది.