
గాంధీ ఆస్పత్రిలో కరోనాకు సరిగా వైద్యం చేయడం లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గాంధీ సూపరింటెండ్ కనీసం సరిగా స్పందించడం లేదని ఆయన అన్నారు. ‘దూల్‌పేటకు చెందిన ఓ వ్యక్తి 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్‌తో చనిపోయాడు. అతనికి కరోనా సోకిన విషయం కుటుంబసభ్యులకు తెలియదు. దాంతో అతను చనిపోయిన తర్వాత.. అతని కూతురు మరియు ఇతర కుటుంబసభ్యులకు కరోనా సోకింది. చనిపోయిన వ్యక్తి కూతురు గర్భవతి. ఆమెను మూడు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని.. ఎలాగైనా ఆమెను కాపాడాలని గాంధీ సూపరింటెండ్‌కు విజ్ఞప్తి చేశాను. ఆయన నా విజ్ఞప్తిని కనీసం పట్టించుకోలేదు. ఆ ప్రెగ్నెన్సీ అమ్మాయి ఇప్పుడు చనిపోయింది. గాంధీలో ట్రీట్మెంట్ సరిగా చేయలేదని కుటుంబ సభ్యులు నాకు కాల్ చేసి చెప్పారు. నేను ఆస్పత్రి అధికారులను సంప్రదిస్తే కనీస స్పందన లేదు. డాక్టర్లు అంటే దేవుడితో సమానంగా కొలిచాం. కానీ, అమ్మాయి చనిపోవడంతో నాకు చాలా బాధనిపించింది. సమస్యలు వస్తే పేద వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? అటు ప్రభుత్వం పట్టించుకోక, ఇటు డాక్టర్లు పట్టించుకోక పేదవాళ్లు ఆందోళనకు గురవుతున్నారు’ అని ఆయన అన్నారు.
For More News..