
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీపై స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. షర్మిల పార్టీ వెనుక ఎవరున్నారో త్వరలో బయట పడుతుందన్న సీతక్క.. వైఎస్ షర్మిల ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణంగా ఉపయోగపడుతుందన్నారు. ఇతర పార్టీల మేలు కోసం షర్మిల రాజన్న పేరును వినియోగించొద్దని సూచించారు. రాజీవ్ రాజ్యం అయినా, రాజన్న రాజ్యం అయినా కాంగ్రెస్ తోనే సాధ్యమని.. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేర్వేరు కాదన్నారు సీతక్క.