ఎమ్మెల్యే సార్‌‌‌‌‌‌‌‌.. రాజీనామా చేయండి

V6 Velugu Posted on Jul 27, 2021

  • మాకూ దళిత బంధు వస్తది.. కోదాడ ఎమ్మెల్యేకు దళిత నేతల విజ్ఞప్తి

కోదాడ, వెలుగు: ‘కోదాడ నియోజకవర్గ దళితుల పక్షాన మా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌గారికి విన్నపం. హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ ఉప ఎన్నిక కోసం సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తీసుకొచ్చిన దళిత బంధు పథకంతో అక్కడి దళిత కుటుంబాలు బాగు పడతాయి. అట్లాగే మనకాడ కూడా మీరు మా మీద ప్రేమతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే పథకం అమలవుతుంది. మేం బాగుపడతాం. దానికి మళ్లీ మిమ్మల్నే భారీ మెజార్టీతో గెలిపిస్తాం. దయచేసి మా కోరిక మన్నించి రాజీనామా చేయండి ప్లీజ్‌‌‌‌‌‌‌‌’ అని కోదాడ దళిత నేతలు కోరుతున్నారు. ఇది కాస్త సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరలైంది. 

Tagged TRS, Telangana, CM KCR, Huzurabad, Kodad, Bollam Malliah yadav, dalithabandhu

Latest Videos

Subscribe Now

More News