- ఇవి అప్పులు కావు.. పెట్టుబడులని వ్యాఖ్య
పద్మారావునగర్, వెలుగు: మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని, సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ప్రతి రూపాయి పారదర్శకంగా లబ్ధిదారులకు చేరుతున్నదని ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు మంజూరైన రూ. 2.07 కోట్ల రుణ చెక్కులను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. అనంతరం చీరెల పంపిణీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ రుణాలు అప్పులు కావని, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడులని స్పష్టం చేశారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేలా సూపర్ బజార్లు, బస్సులు, పెట్రోల్ బంక్‌లు, క్యాంటీన్ల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో మెప్మా అధికారి ప్రకాశ్, బ్యాంకు అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
