నార్కట్‌పల్లి, వెలుగు : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన గడుసు నవ్య మృతి చెందడంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నవ్య, ఆదివారం జరిగిన ప్రమాదంలో మరణించారన్న వార్త తెలియగానే ఎమ్మెల్యే సోమవారం వారి గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
నవ్య మృతి చెందడం ఎంతో బాధాకరమని పేర్కొంటూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు భత్తుల ఊషయ్య గౌడ్, సర్పంచ్ నేతగాని కృష్ణయ్య, దేవాలయ చైర్మన్ వాడాల రమేశ్, నాయకులు ఉన్నారు.
