నార్కట్పల్లి, వెలుగు: నాణ్యమైన విద్య అందించే విద్యా సంస్థలకు ఎల్లప్పుడు గుర్తింపు ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంఅన్నారు. నార్కట్పల్లి మండల కేంద్రంలోని పీవీఆర్ శ్రీ చేతన హై స్కూల్ యజమాన్యం పుచ్చకాయల వెంకట్ రెడ్డి సునీత ఆధ్వర్యంలో సొంత ఖర్చుతో గురువారం పంచాయతీ కార్మికులకు సంక్రాంతి కిట్టు పంపిణీ చేశారు. నూతనంగా గెలుపొందిన సర్పంచ్ పాలకవర్గానికి సన్మానం చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో రూ. 25 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల పై ఆధారపడి ఉంటుందన్నారు. విద్యాసంస్థలు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలన్నారు. ట్రస్మా గౌరవ అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య గౌడ్, సర్పంచ్ జేరిపోతుల భరత్ గౌడ్, ఉప సర్పంచ్ సోమశిరీష, మాజీ ఎంపీటీసీ పాశం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ పబ్బత్ రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
