
భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ స్థానం ప్రత్యేకం. రెండు దశాబ్దాలకు పైగా తన బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ ని శాసించిన టెండూల్కర్ లెక్కలేన్నని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత రత్న అవార్డు సైతం సచిన్ కి వరిచిందంటే అయన ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించారో తెలుసుకోవచ్చు. అయితే తాజాగా ఇప్పుడు క్రికెట్ ఒక ఒక యాడ్ ప్రమోషన్ లో భాగంగా సచిన్ చిక్కుల్లో పడ్డాడు.
ఆన్ లైన్ గేమింగ్ ప్రమోట్ :
క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన వ్యాపార ప్రకటనల ద్వారా సచిన్ ఎప్పటికప్పుడూ బిజీ అవుతూ వస్తున్నాడు. గతంలో ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించిన సచిన్.. ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని యాడ్స్ విషయంలో మాత్రం నో చెప్పి తన గొప్ప మనసుకుని చాటుకున్నాడు. సచిన్ టెండూల్కర్ ఓ ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ని ప్రమోట్ చేయడం వివాదాస్పదమైంది. సచిన్ ఫ్యాన్స్ సైతం ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పేరు సంపాదించుకున్న సచిన్.. ఇలాంటి ఆన్‌లైన్ గేమింగ్‌ని ప్రమోట్ చేయడాన్ని సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్ కూడా ఇలాంటి ఆన్‌లైన్ గేమింగ్‌ని ప్రమోట్ చేయడాన్ని తప్పు పడుతున్నారు.
మండిపడ్డ ఎమ్మెల్యే బచ్చూ కాడూ:
ప్రహార్ జనశక్తి పార్టీ ఎమ్మెల్యే బచ్చూ కాడూకి సచిన్ ఆన్ లైన్ గేమ్ ప్రమోటింగ్ చేయడం అసలు నచ్చలేదు. ఈ సందర్భంగా తన అనుచరులతో నిరసనలు చేప్పట్టడమే కాకుండా సచిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసాడు. "భారత రత్న అందుకున్న ఒక వ్యక్తి ఆన్‌లైన్ గేమింగ్స్‌ని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు. అతను బ్యాటింగ్ నుంచి బెట్టింగ్ కి మారాడు. భవిష్యత్ తరాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ప్రకటన నుంచి సచిన్ టెండూల్కర్ వచ్చే 15 రోజుల్లో తప్పుకోవాలి. లేకపోతే నిరసనలు తీవ్రం చేస్తాం. ఇలాంటి ఆన్‌లైన్ గేమింగ్ యాడ్స్ ద్వారా సచిన్ టెండూల్కర్ రూ.300 కోట్లు సంపాదించుకోవాలని అనుకుంటే, ఆయన తనకి ఇచ్చిన భారత రత్న అవార్డును తిరిగి ఇచ్చేయాలి". అని హెచ్చరించాడు. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేస్తే భారత రత్న అవార్డు ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకి లేఖ కూడా రాశాడు.