కేసీఆర్ చెప్పే మాటలకు ..చేసే పనులకు ఎక్కడన్నా పొంతన ఉందా

కేసీఆర్ చెప్పే మాటలకు ..చేసే పనులకు ఎక్కడన్నా పొంతన ఉందా

నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా తాను మొదలుపెట్టిన పాదయాత్ర ఇంకా పది పదిహేను రోజులు కొనసాగుతుందని అన్నారు తీన్మార్ మల్లన్న.  జనవరి 3నాటికి భువనగిరిలో తన పాదయాత్ర ముగుస్తుందన్న ఆయన .., ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ప్రజలలో వచ్చిన మార్పులేమిటి..?

వ్యవసాయదారులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగులకు పీఆర్సీ అమలు, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రత్యక్షంగా ప్రజల నుండి తెలుసుకునే ఉద్దేశంతో పాదయాత్ర ప్రారంభించినట్లు చెప్పారు.  కేసీఆర్ చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరి జీవితంలో అనూహ్య మార్పులు జరుగుతాయని అందరు అనుకున్నారని కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల కంటే దిగజారి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం లో సుమారు 3వేల మంది రైతులు  ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. పీఆర్సీ, పాత పెన్షన్ విధానం అని, ఉద్యోగాల భర్తీ అని ,మళ్లీ చెబుతూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తీన్మార్ మల్లన్న ప్రశ్నించే ముందు వరకు కేసీఆర్ ప్రభుత్వం పై ఎవరూ మాట్లాడటానికి ధైర్యం లేదని,  ఇప్పుడు క్రమక్రమంగా ప్రజలలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే విషయంలో సక్సెస్ అయ్యామని  తీన్మార్ మల్లన్న చెప్పారు.