విద్యుత్ ఒప్పందాల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. న్యాయ వ్యవస్థను కేసీఆర్ కించపరుస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ విచారణకు సహకరించకపోతే నేరాన్ని అంగీకరించినట్టే అవుతుందని అన్నారు. విచారణ అధికారి నరసింహారెడ్డికి కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. కెసిఆర్ తప్పుడు ఆలోచనతో రాష్ట్ర ప్రజలపై 40వేల కోట్ల భారం పడిందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అసలు అవసరం లేదు. పవర్ కమిషన్ చైర్మణ్ నరసింహారెడ్డిని వైదొలగమనడానికి కేసీఆర్ ఎవరు అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి.
విద్యుత్ ప్రాజెక్ట్ లలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ కెసిఆర్ కొత్త నినాదం తెచ్చారని అన్నారు. బొగ్గు లభ్యత ఉన్న రామగుండంలో కాదని దామరాచర్లలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తారా అని ప్రశ్నించారు.సోలార్ పవర్ తో యూనిట్ 3 రూపాయలకే విద్యుత్ లభిస్తుంది యాదాద్రి థార్మల్ పవర్ తో రాష్ట్ర ప్రజానీకం పై భారం పడుతుందని అన్నారు.యాదాద్రి పవర్ ప్లాంట్ అసలు అవసరం లేదని, నరసింహారెడ్డి నివేదికతో భయం పట్టుకుందని అన్నారు.