
కవితను బలి చేసింది టీఆర్‌ఎస్ నాయకులే
23 కొత్త జిల్లాల్లో 23 ఉద్యోగాలైనా ఇచ్చారా?
కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్
జగిత్యాల, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రజలకు అది పెద్ద శాపం అవుతుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటికే ఆ పార్టీ ప్రజల్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. శనివారం జగిత్యాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జెండా పండగ ప్రోగ్రామ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘అధికార వికేంద్రీకరణ, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి సాధించింది ఏంటి? 23 కొత్త జిల్లాల్లో కనీసం 23 మంది ఉద్యోగులనైనా నియమించావా’అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. గత ఐదేళ్లలో జగిత్యాలకు మీరు చేసిందేంటో చెప్పులని డిమాండ్ చేశారు.
మున్నిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓస్తే కనువిప్పు కలుగుతుందని… హామీల అమలుకు పనిచేస్తుందని అన్నారు. టీఆర్‌ఎస్ నేతలు వర్గాలను ప్రోత్సహించి ఎంపీ ఎన్నికల్లో కవితను బలి చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. స్థానిక నేతలు ఒక్క అభివృద్ధి పని చేయడం లేదని కనీసం ఆమె గెలిస్తేనన్న… తండ్రి కేసీఆర్ సహకారంతో కొన్ని పనులైనా జరిగేవన్నారు. నాలుగు దశాబ్దాలుగా జగిత్యాల పట్టణ ప్రజలకు తాగునీరు లేకుండా చూసింది అందించి, రైతుబజార్ పన్ను ఎత్తి వేసి, చిరు వ్యాపారులకు అండగా నిలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.