మేం గ్రావిటీ ద్వారా సుందిళ్లకు నీళ్లందించే వాళ్లం: జీవన్ రెడ్డి

మేం గ్రావిటీ ద్వారా సుందిళ్లకు నీళ్లందించే వాళ్లం:  జీవన్ రెడ్డి

తుమ్మిడిహట్టి దగ్గర బ్యారెజీ నిర్మించి ఉంటే గ్రావిటీ ద్వారా సుందిళ్లకు నీళ్లందించే వాళ్లమన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రాజెక్టు రీడిజైన్ తో ఇప్పటికే మూడేళ్లు ఆలస్యమైందన్నారు. 38 వేల కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టుకు కేసీఆర్ 85 వేల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ కు నీళ్లు తరలించడంలో జాప్యం ఎందుకని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. వారం క్రితమే మిడ్ మానేర్ కు నీళ్లు తరలించాల్సిందన్నారు. ప్యాకేజీ 6,7,8 పనులు ఉమ్మడి ఏపీలోనే సగం పూర్తయ్యాయని చెప్పారు. వెంటనే మిడ్ మానేరుకు నీరు తరలించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.