
రుణమాఫీపై సీఎం కేసీఆర్ కు లెటర్ రాశారు ఎమ్మెల్సీ , కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం… లక్ష రూపాయల వరకు ఉన్న స్వల్పకాలిక పంట రుణాలను వెంటనే మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడి ఆరు నెలలవుతున్నా…. ఎలాంటి హామీలు ఇంకా నెరవేర్చలేదన్నారు. వర్షాకాలం ప్రారంభమైనా రుణమాఫీపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం బాధకారమన్నారు. గతంలో తీసుకున్న అప్పు తీరిస్తేనే… కొత్త అప్పులిస్తామని బ్యాంకులు రైతులను ఇబ్బంది పెడుతున్నాయన్నారు.