రీడిజైనింగ్ పేరుతో ప్రజలపై రూ.50 వేల కోట్ల భారం

రీడిజైనింగ్ పేరుతో ప్రజలపై రూ.50 వేల కోట్ల భారం

కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా రాకపోవడానికి కారణ కేసీఆర్ వైఫల్యమేనన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. శనివారం కరీంనగర్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో రూ.38 వేల కోట్లతో ఉన్న ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేసీఆర్ రూ.83 వేల కోట్లకు పెంచారన్నారు. కమీషన్ల కక్కుర్తితో సీఎం కేసీఆర్ ప్రజలపైన రూ.50 వేల కోట్ల అదనపు భారం వేశారన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చెయ్యాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రశ్నించడానికి కనీసం లోకాయుక్త నియామకాన్ని కూడా ముఖ్యమంత్రి చేపట్టలేదన్నారు.

రూ.38 వేల కోట్లతో 16 లక్షల 40వేల ఎకరాలకు నీరందించడం అంచనా అయితే..రూ.83 వేల కోట్ల రూపాయలతో కేవలం18 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందతుందన్నారు జీవన్ రెడ్డి. లక్ష 60వేల ఎకరాల సామర్థ్యం పెంచడానికి సీఎం అదనంగా రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రేపు కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా వచ్చినా..  ఖర్చు పెట్టిన వేల కోట్ల రూపాయలు తిరిగి రావని జీవన్ రెడ్డి  అన్నారు.