ఖరీఫ్ సీజన్ మొదలైనా రుణమాఫీపై క్లారిటీ ఇవ్వలేదు: జీవన్ రెడ్డి

ఖరీఫ్ సీజన్ మొదలైనా రుణమాఫీపై క్లారిటీ ఇవ్వలేదు: జీవన్ రెడ్డి

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మొదలైనా ప్రభుత్వం రుణమాఫీపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదని అన్నారు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ రోజు గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా.. రుణమాఫీపై క్లారిటీ ఇవ్వలేదని అన్నారు. లక్ష లోపు రుణమాఫీపై.. 4శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం, 3శాతం వడ్డీని నాబార్డ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వంతు చెల్లించే వడ్డీపై క్లారిటీ ఇవ్వకపోవడంతో.. బ్యాంకులు ఆ ధనాన్ని రైతుల నుంచి వసూలు చేస్తున్నారని అన్నారు జీవన్ రెడ్డి. ఎకరానికి 1320 రూపాయలను రైతులు బ్యాంకుకు కడుతున్నట్లు చెప్పారు.

కేబినెట్ మీటింగ్ లో కేసీఆర్ రైతుల గురించి, ఉద్యోగుల గురించి మాట్లాడక పోవడం దారుణమని అన్నారు జీవన్ రెడ్డి. ఇప్పటివరకూ..PRC, IR పై ప్రకటన రాలేదని చెప్పారు. పక్క రాష్ట్రమైన ఏపీలో ప్రభుత్వం ఏర్పడగానే.. CPS, PRC, IR 27 శాతం పెంచి ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేశారని చెప్పారు.  నిరుద్యోగ భృతిపై రాష్ట్ర ప్రభుత్వం ఊసెత్తడంలేదని అన్నారు జీవన్ రెడ్డి.