లలితా కళా అకాడమీ ఏర్పాటుకు నావంతు కృషి చేస్తా

లలితా కళా అకాడమీ ఏర్పాటుకు నావంతు కృషి చేస్తా

హైదరాబాద్: మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ లో ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే ఏర్పాటు చేసిన ‘పూలమ్మ’ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను ... ఆయన కుమార్తె ప్రియాంక ఏలే ఏర్పాటు చేసిన సామెత మార్గాలు (Proverbial Pathways )పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. పెయింటింగ్ ఎగ్జిబిషన్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో  ప్రపంచ నలుమూలల నుండి వచ్చి  ఎగ్జిబిషన్స్  నిర్వహిస్తుండడం గర్వకారణమని అన్నారు. 


రాష్ట్రంలో లలిత కళా అకాడమీ ఏర్పాటు చేయాలని కళాకారులు కోరుతున్నారు.. లలితా కళా అకాడమీ ఏర్పాటుకు నావంతు కృషి చేస్తా.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. లక్ష్మణ్ ఏలే, ప్రియాంక ఏలే ఇరువురి అద్భుతమయిన పెయింటింగ్స్ ను తీర్చిదిద్దారని,  బతుకమ్మ పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పెయింటింగ్స్ ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏలె లక్ష్మణ్.. ఏ ఆర్ట్ అయినా, పెయింటింగ్ డిజైన్ అయినా తమకు అందించేవారని గుర్తు చేసుకున్నారు.