కుస్తీ పోటీలకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తది : ఎమ్మెల్సీ కవిత

కుస్తీ పోటీలకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తది : ఎమ్మెల్సీ కవిత

ప్రాచీన క్రీడ అయిన రెజ్లింగ్ ను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు రెజ్లింగ్ లోనే ఎక్కువ పతకాలు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన హింద్ కేసరి 2022, 51వ సీనియర్ నేషనల్ ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ ముగింపు కార్యక్రమానికి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 85 కేజీల మహిళల రెజ్లింగ్ మ్యాచ్ ను ఆమె వీక్షించారు. టైటిల్ మ్యాచ్ లో విజయం సాధించిన విజేతలను, రన్నరప్ గా నిలిచిన క్రీడాకారులను కవిత అభినందించారు.

అనంతరం మాట్లాడిన కవిత.. రెజ్లింగ్ అంటే బలమే కాదు తెలివి, టెక్నిక్, స్పీడ్ ప్రదర్శించే క్రీడ అని అన్నారు. కుస్తీ పోటీలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందన్నారు. దంగల్ అంటే దమ్మున్న క్రీడ.. దమ్మున్న క్రీడలో పాల్గొనే క్రీడాకారులను సీఎం కేసీఆర్ ఎప్పుడూ ప్రోత్సహిస్తారని ఆమె పేర్కొన్నారు. విజయ్ కుమార్ యాదవ్ గౌరవార్థం జరుగుతున్న ఈ రెజ్లింగ్ పోటీలకు హాజరు కావడం సంతోషంగా ఉందని కవిత చెప్పారు.