బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత

 బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బంగారు బోనం సమర్పించారు. ఆమె వెంట మహిళలు భారీగా తరలివచ్చారు. ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి రెండు వేల బోనాలతో ర్యాలీగా వచ్చారు. బోనాలు, పోతారాజులు, డప్పు చప్పుళ్లు, డీజే సౌండ్, కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించారు. బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. హైదరాబాద్ కు పెద్ద ఆశీర్వాదం ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నాం అన్నారు. దక్షిణాదిలో పెద్ద ఎత్తున వానలు కురుస్తున్నాయి. వానలు తగ్గుముఖం పట్టాలని రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ కోరారు అని ఆమె గుర్తు చేశారు. వరదలు కొన్ని జిల్లాల్లో ఇబ్బందులు పెడుతున్నాయని.. వరదలు వచ్చిన ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుకున్నాం అన్నారు. వర్షాలు కురిసిన పంటల నష్టం, ప్రాణ నష్టం కలగకుండా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అన్నారు.