ఢిల్లీ బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి బయల్దేరారు. బంజారాహిల్స్ నివాసం నుంచి.. మార్చి 8వ తేదీ మధ్యాహ్నం 4 గంటల సమయంలో..  శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు.  మార్చి 9వ తేదీ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన క్రమంలో.. ప్రగతిభవన్ లో తండ్రి, సీఎం అయిన కేసీఆర్ తో సమావేశం అవుతారని అందరూ భావించారు. అలాంటిది ఏమీ జరగలేదు. ఇంటి నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే సమయంలో కవిత వెంట ముఖ్య అనుచరులు, కొంత మంది పార్టీ నేతలు ఉన్నారు. భారీ కాన్వాయ్ తో ఆమె ఎయిర్ పోర్టు వెళ్లటం విశేషం. 

మార్చి 9వ తేదీ విచారణకు హాజరుకాలేనని.. 15వ తేదీ తర్వాత వస్తానంటూ ఈడీకి లేఖ రాశారు కవిత. కవిత లేఖపై 8వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేరు ఈడీ. ఈడీ సమాధానం ఇవ్వకపోతే.. విచారణకు హాజరుకావాల్సి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. మార్చి 10వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా బిల్లు సాధన దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగానే కవిత.. ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇదే సమయంలో ఈడీ నోటీసులతో  ఆసక్తి నెలకొంది. 

ప్రగతిభవన్ వెళ్లకుండానే.. నేరుగా ఢిల్లీకి కవిత బయలుదేరారు అంటే.. ఏదో ఆసక్తికరమైన మలుపు ఉండొచ్చని భావిస్తున్నారు అందరూ...