
సీఎం కేసీఆర్ తో ప్రగతిభవన్ లో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. మార్చి 11న జరిగిన ఈడీ విచారణపై ఆమె కేసీఆర్ తో చర్చిస్తున్నారు. ఈ భేటీలో మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. ఈడీ విచారణ అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న కవిత నేరుగా కేసీఆర్ ను కలిసి విచారణకు సంబంధించిన విషయాలను ఆయనతో చర్చించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిన్న కవితను ఈడీ అధికారులు 9 గంటల పాటు విచారించారు. అనంతరం ఈనెల 16న మళ్లీ విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.