తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది : కవిత

తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది : కవిత

కోట్లాది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కేసీఆర్ ప్రాణాలుపణంగా పెట్టారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దిక్షా దివస్ సందర్భంగా ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఆమె ట్విట్టర్లో ట్వీట్ చేశారు.తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అంటూ సమైక్య పాలకుల నిర్బంధాలను చేధించి నవంబర్ 29న కేసీఆర్ దీక్ష చేపట్టారని కవిత ట్వీట్ లో పేర్కొన్నారు. సిద్ధిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కేసీఆర్ ఇదే రోజున దీక్షను ప్రారంభించారన్నారు. ఆనాటి ఆమరణ నిరాహారదీక్ష స్పూర్తితో, స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ గారి సారధ్యంలో, సర్కారు సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో సబ్బండ వర్ణాలు సగర్వంగా, సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలుస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కవిత అన్నారు. 

నవంబర్ 29 తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.  "కేసీఆర్ గారి చారిత్రాత్మక దీక్షకు 12 ఏళ్లు. రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మన ఉద్యమ నేత కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షకు దిగి తన ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు" అంటూ హరీష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.