
హైదరాబాద్, వెలుగు: అదానీ కుంభకోణంతో రూ.10 లక్షల కోట్ల ప్రజల సంపదను ప్రధాని మోడీ ఆవిరి చేశారని, అలాంటి ప్రధాని మనకు అవసరమా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో అదానీ వ్యవహారంపై ఎంక్వైరీ జరిపించి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ‘‘హిడెన్ బర్గ్ నివేదిక వెల్లడైన పది రోజుల్లోనే అదానీ ప్ర పంచ కుబేరుల జాబితాలో రెండో ప్లేస్ నుంచి 22వ స్థానానికి పడిపోయారు. హిడెన్ బర్గ్ నివేదిక త ర్వాత అదానీ సంస్థల షేర్లు 51 శాతం పడిపోయా యి. ఎల్ఐసీ రూ.18 వేల కోట్లు నష్టపోయింది. ఈ సంస్థల షేర్లు కొనుగోలు చేసిన దేశంలోని అనేక మంది తీవ్రంగా నష్టపోయారు” అని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టపోతున్నా ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
జెడ్పీ మీటింగ్‌లో మాట్లాడాల్సినవి కౌన్సిల్‌లోనా మాట్లాడేది
“కొందరు సభ్యులు జెడ్పీ మీటింగ్‌లో మాట్లాడాల్సిన మాటలు కౌన్సిల్‌లో మాట్లాడుతున్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఆ సమస్యలు అక్కడే జిల్లా పరిషత్ మీటింగ్‌లో చర్చించుకోవాల్సినవి. కలెక్టర్‌కు చెప్పి పరిష్కరించుకోవచ్చు” అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బుధవారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా సెకండ్ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల జీతాలు పెంచాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. గల్ఫ్ ఎన్ఆర్ఐ సంక్షేమానికి 200 కోట్ల బడ్జెట్ పెట్టాలని, ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీచేయాలని, ముస్లిం, క్రైస్తవులు మరణిస్తే ఖననం చేసేందుకు స్థలాలు ఇవ్వాలని కోరారు. తర్వాత కవిత మాట్లాడుతూ.. ఏఎన్ఎం, ఆశా వర్కర్ల అంశం జిల్లా పరిషత్‌లో మాట్లాడుకోవాల్సినవని అన్నారు. ఓ సీనియర్ సభ్యుడు ఇలాంటి సమావేశంలో మాట్లాడాన్ని ఆమె తప్పుపట్టారు. దీంతో జీవన్ రెడ్డి తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని చైర్మన్ ను కోరారు. అసభ్యకరమైన పదాలు లేవని, ఉంటే తొలగిస్తామని చైర్మన్ సర్దిచెప్పారు. చర్చలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఫారుక్ హుస్సేన్, జనార్దన్ రెడ్డి, ప్రభాకర్, బండ ప్రకాశ్, కోటిరెడ్డి, రఘోత్తంరెడ్డి తదితరులు మాట్లాడారు.