
రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహాధర్నా చేపడుతున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ ధర్నాలో రైతన్నలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పోరాటాలతోనే తలొగ్గుతదని..అందుకే రేపటి ధర్నాతో తమ సత్తా ఏంటో చూపిద్దామన్నారు. కార్పొరేట్లు చుకుని దేశం దాటిపోతున్నారని ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్లందరినీ వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నల్లధనం తీసుకొస్తానన్న మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు.
పాలు పెరుగుపై పన్ను విధించడమేనా..? బీజేపీ పాలనా.? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా)ను వ్యవసాయానికి అనుబంధం చేయాలని డిమాండ్ చేశారు, కేంద్రం పెట్టుబడిదారులకు వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. చంద్రబాబు మళ్ళీ తెలంగాణాలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారని.. ఇప్పటికే టీడీపీ భూస్థాపితమైందని కవిత అన్నారు. తెలంగాణాకు ఎంతమంది వచ్చినా చంద్రుడు కేసీఆర్ ఒక్కడేనని అన్నారు.