
ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటించారు. మల్యాల మండలం నూకపల్లిలో జరుగుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. రూ. 212 కోట్ల నిధులతో.. ఇక్కడ 4,520 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లను త్వరలోనే పంపిణీ చేస్తామని ఆమె తెలిపారు. మిగతా ప్రాంతాల్లో వేగంగా పనులు పూర్తయ్యేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. జనం డిమాండ్‌తో జగిత్యాలను జిల్లా చేశామనీ.. మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేశామని ఆమె అన్నారు. ఈ ప్రాంతానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా త్వరలోనే వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా కలెక్టర్ రవి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.