జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన కవిత

జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన కవిత

హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతోన్న 35 వ జాతీయ పుస్తక ప్రదర్శనను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. తెలంగాణ జాగృతి బుక్ స్టాల్స్ను ఆమె సందర్శించారు. అనంతరం ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటి పై జరిగే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె బయలుదేరి వెళ్లారు.   

ఈ నెల 22న ప్రారంభమైన  ఈ పుస్తక ప్రదర్శన జనవరి 1 వరకు కొనసాగనుంది. బుక్ ఎగ్జిబిషన్ లో మొత్తం 300 స్టాళ్లు ఏర్పాటు చేయగా..10 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. బుక్ ఫెయిర్ లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూతో పాటు ఇతర భాషల పుస్తకాలు లభిస్తున్నాయి. బాల సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం, పురాణ సాహిత్యం, నవలలు, కథలు, సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్స్ పుస్తక ప్రియులకు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు, విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్స్ కూడా ఈ బుక్స్ స్టాల్స్ లో అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.