Delhi liquor Scam: అతి త్వరలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తరు : కేఏ పాల్

Delhi liquor Scam: అతి త్వరలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తరు : కేఏ పాల్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఆరు నెలలుగా లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు జరుగుతుందని....ఈ కేసు విచారణను సీబీఐ మరింత వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలని అధికారులను కోరేందుకు కేఏ పాల్ ఇవాళ సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఆదివారం కావడంతో తిరిగి వచ్చారు. 

లిక్కర్ స్కాం వెనుక ఎవరున్నారో అందరికి తెలుసన్న పాల్..ఆలస్యం చేస్తే రాజకీయాలకు అంటగడతారని విమర్శించారు. అతి త్వరలో ఎమ్మెల్సీ కవితతో పాటు..మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేస్తుందని వ్యాఖ్యానించారు. సిసోసిడియాకు నోటీసులు ఇస్తున్న సీబీఐ..ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.