టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ రేట్లు పెంచండి : ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ రేట్లు పెంచండి : ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
  •     సీఎంకు ఎమ్మెల్సీ వినతి 

హైదరాబాద్, వెలుగు: టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ రేట్లను పెంచాలని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం అసెంబ్లీలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్‌‌‌‌తో కలిసి సీఎం రేవంత్​రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు, టీచర్లకు ఫిబ్రవరి నెల జీతాలు అందలేదని చెప్పారు.

ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌‌‌‌లో ఆధార్ కార్డు అనుసంధానం చేసే క్రమంలో డేటా మిస్ మ్యాచ్ కావడమే దీనికి కారణమన్నారు. మరోసారి ఆధార్ లింక్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. స్పందించిన సీఎం రేవంత్​రెడ్డి..  ఫైనాన్స్ అధికారులతో మాట్లాడారు. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌‌‌‌లో ఆధార్ అనుసంధానానికి మరో మూడు రోజులు అవకాశం కల్పిస్తున్నట్లు ఫైనాన్స్​సెక్రటరీ తెలిపారు.