హైదరాబాద్ లో రెండ్రోజులు పాక్షికంగా ఎంఎంటీఎస్ రద్దు

హైదరాబాద్ లో రెండ్రోజులు పాక్షికంగా ఎంఎంటీఎస్ రద్దు
  •     మరికొన్ని రూట్ల మార్పులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరంలో ఎంఎంటీఎస్​రైళ్ల నిర్వహణలో భాగంగా ఈ నెల 11, 12 తేదీల్లో కొన్నింటిని రద్దు చేయడంతో పాటు మరికొన్ని రూట్లలో మార్పులు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన వాటిలో లింగంపల్లి – ఉమ్ధానగర్​, ఉమ్ధానగర్–లింగంపల్లి, లింగంపల్లి– ఫలక్​నుమా, ఫలక్​నుమా–లింగంపల్లి మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. 

మార్పులు జరిగిన వాటిలో ప్రస్తుతం రామచంద్రాపురం–హైదరాబాద్​ మధ్యనడిచే రైళ్లను తెల్లాపూర్​ హైదరాబాద్​ మధ్య నడిపించనున్నారు. అలాగే హైదరాబాద్​–లింగంపల్లి , లింగంపల్లి–హైదరాబాద్​మధ్య నడిచే రైళ్లను యథావిధిగా నడపున్నారు.