హ్యాపీ జర్నీ నుంచి ‘సీతాకోకలా సరిహద్దులా’ సాంగ్ రిలీజ్

హ్యాపీ జర్నీ నుంచి ‘సీతాకోకలా సరిహద్దులా’ సాంగ్ రిలీజ్

మహిళా భావోద్వేగాలకు  ప్రాధాన్యతనిస్తూ రూపొందుతోన్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ,  జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో బాలాజీ గుత్తా,  కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్, టీజర్‌‌‌‌ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా  ‘సీతాకోకలా సరిహద్దులా’  సాంగ్‌‌ను రిలీజ్ చేశారు.

 శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన ఈ పాటకు సురేష్ బానిశెట్టి రాసిన లిరిక్స్, చిన్మయి శ్రీపాద పాడిన తీరు ఆకట్టుకుంది. ‘నీతోటి నువ్వే స్నేహాన్ని చేస్తే.. ఏనాడు నువ్విక ఒంటిరివి కాదే.. ఏ గాయమైనా చిరునవ్వు పూస్తే.. ఏ మందుతో ఇంకా అవసరము లేదే..’ అంటూ సాగిన పాట  మహిళలందరికీ తమకు ఎటువంటి బౌండరీలు లేవని గుర్తుచేసేలా సాగింది. ప్రతి మహిళకు కనెక్ట్ అయ్యేలా ఉన్న ఈ పాట సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. పారిస్, మాంట్‌‌పెలియర్, యూరప్ వంటి  ఫారిన్‌‌ లొకేషన్స్‌‌లో  చిత్రీకరించిన ఈ  సాంగ్  విజువల్స్ ఆకట్టుకున్నాయి.  త్వరలోనే సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.