హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ టీచర్లను జీవో 317 కింద స్థానికత ప్రకారం సొంత జోన్లకు పంపించే ప్రక్రియ స్పీడందుకుంది. కొందరు కోర్టుకు పోయినా.. ఆ ప్రక్రియ కొనసాగించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రొఫరెన్షియల్ కేటగిరీలో వితంతు, మెడికల్ ప్రిఫరెన్స్ కేటగిరిలో ప్రయోజనం పొందేందుకు దరఖాస్తు చేసుకున్న టీచర్ల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు.
ఈనెల13న పీజీటీ, టీజీటీ సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్టు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ చారి తెలిపారు. ఈ కేటగిరీల కింద ఆప్షన్లు ఇచ్చుకున్న టీచర్లు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని ఆదేశించారు.
