
ప్రధాని మోడి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోడీ’. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, నటుడు వివేక్ ఒబెరాయ్ విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అన్ని బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు వివేక్. ఎగ్జిట్ పోల్స్‌పై మేమంతా ఆనందంగా ఉన్నామన్నారు. కొద్దిరోజుల క్రితం బీజేపీకి తక్కువ సీట్లు వస్తాయని మాట్లాడారు…. కానీ, మేమెప్పుడూ భయపడలేదన్నారు. మూవీ షూటింగ్ టైంలోనూ ప్రధాని మోడీ పై ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయత మాటల్లో చెప్పలేమన్నారు.
పీఎం నరేంద్ర మోడీ సీనిమాలో మోడీ పాత్రను బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పోషిస్తున్నారు. ఒముంగ్ కుమార్ దర్శకత్వం వహించారు.