మోడీ 2.0 టీమ్: కేంద్రమంత్రుల శాఖలు

మోడీ 2.0 టీమ్: కేంద్రమంత్రుల శాఖలు

ఢిల్లీ: నరేంద్రమోడీ కేబినెట్‌లో మంత్రులకు శాఖలు కేటాయించారు. గత మంత్రి వర్గంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖ అప్పగించారు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన అమిత్‌ షాకు హోంశాఖ అప్పగించారు. గురువారం రాత్రి 57 మందితో కొత్త కేబినెట్‌ కొలువుదీరింది. ఇందులో 24 మందికి కేబినెట్‌, 9 మందికి స్వతంత్ర హోదా, 24 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు. ఈదఫా మంత్రివర్గంలో 20 మంది కొత్తవారికి అవకాశం లభించింది.

కేంద్రమంత్రుల శాఖల వివరాలు

కేబినెట్ హోదా

అమిత్ షా – హోం శాఖ
రాజ్‌నాథ్ సింగ్ – రక్షణ శాఖ
నితిన్ గడ్కరీ – రోడ్లు, రవాణా
నిర్మలా సీతారామన్ – ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు
రాంవిలాస్ పాశ్వాన్ – వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ
సదానంద గౌడ – కెమికల్, ఫెర్టిలైజర్స్ (రసాయనాలు, ఎరువుల శాఖ)
నరేంద్ర సింగ్ తోమర్ – వ్యవసాయం, రైతుల సంక్షేమం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి
హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ – ఫుడ్ ప్రాసెసింగ్
రవిశంకర్ ప్రసాద్ – సమాచార శాఖ, న్యాయ శాఖ
రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ – మానవ వనరుల అభివృద్ధి శాఖ
పీయూష్ గోయల్ – రైల్వే శాఖ, వాణిజ్యం, పరిశ్రమల శాఖ
థావర్ చంద్ గెహ్లాట్ – సాంఘిక సంక్షేమం, సాధికారిత
సుబ్రమణ్యం జయశంకర్ – విదేశీ వ్యవహారాల శాఖ
ప్రకాశ్ జవదేకర్ – పర్యావరణం, అటవీ శాఖ, ఇన్ఫర్మేషన్ బ్రాడ్‌కాస్టింగ్
ధర్మేంద్ర ప్రదాన్ – పెట్రోలియం, సహజ వాయువు, ఉక్కు శాఖ
స్మృతి ఇరానీ – మహిళా, శిశు సంక్షేమం, జౌళి శాఖ
ప్రహ్లాద్ జోషి – పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, ఖనిజ శాఖ
డాక్టర్ హర్షవర్ధన్ – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ – మైనార్టీ వ్యవహారాల శాఖ
అర్జున్‌ ముండా – గిరిజన సంక్షేమం
మహేంద్రనాథ్ పాండే – స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
అరవింద్‌ గణపత్‌ సావంత్‌ – భారీ పరిశ్రమలు
గజేంద్రసింగ్‌ షెకావత్‌ – జలశక్తి
గిరిరాజ్‌ సింగ్‌ – పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్‌

స్వతంత్ర హోదా
సంతోష్‌ కుమార్‌ గాంగ్వర్‌ – శ్రామిక, ఉపాధి కల్పన శాఖ
ఇంద్రజీత్‌ సింగ్‌ – ప్రణాళిక, గణాంక శాఖ
శ్రీపాద యశోనాయక్‌ – ఆయుష్‌, రక్షణ శాఖ
జితేంద్ర సింగ్‌ – ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పీఎంవో సహాయ మంత్రి
కిరణ్‌ రిజిజు – క్రీడలు, యువజన, మైనారిటీ వ్యవహారాలు
ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ – సాంస్కృతిక, పర్యాటక శాఖ
రాజ్‌ కుమార్‌ సింగ్‌- విద్యుత్‌, సంప్రదాయేతర విద్యుత్‌, నైపుణ్యాభివృద్ధి
హర్‌దీప్‌ సింగ్‌ పూరి – గృహ నిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ
మన్‌సుఖ్‌ మాండవీయ – షిప్పింగ్‌; ఎరువులు, రసాయనాలు

సహాయ హోదా

కిషన్‌ రెడ్డి – హోంశాఖ
అశ్వనీ కుమార్‌ చౌబే – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
ఫగాన్‌ సింగ్‌ కులస్థే – ఉక్కు శాఖ
జనరల్‌ వీకే సింగ్‌ – రహదారులు, రవాణాశాఖ
పురుషోత్తమ్‌ రూపాలా – వ్యవసాయం, రైతు సంక్షేమం
అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ – పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
కిషన్‌ పాల్‌- సామాజిక న్యాయం, సాధికారత
రావు సాహేబ్‌ ధాన్వే – వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ
రాందాస్‌ అథవాలే – సాంఘిక న్యాయం, సాధికారత
సాధ్వి నిరంజన్‌ జ్యోతి – గ్రామీణాభివృద్ధి
సంజయ్‌ ధోత్రే – మానవ వనరులు, కమ్యూనికేషన్‌, ఐటీ శాఖ
బాబుల్‌ సుప్రియో – అటవీ పర్యావరణ శాఖ
సంజీవ్‌ కుమార్‌ బల్యాన్‌ – పాడి, పశుగణాభివృద్ధి, పిషరీస్‌
నిత్యానంద్ రాయ్ – హోంశాఖ సహాయ మంత్రి
అనురాగ్‌ ఠాకూర్‌ – ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాలు
సురేశ్‌ చిన బసప్ప – రైల్వే శాఖ
రతన్‌ లాల్‌ కఠారియా – నీటి వనరులు, సాంఘిక న్యాయం, సాధికారత
ప్రతాప్‌ చంద్ర సారంగి – మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, పాడి పశుగణాభివృద్ధి శాఖ
మురళీధరన్‌ – పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు
రేణుకా సింగ్‌ సరూటా – గిరిజన వ్యవహరాలు
సోంప్రకాశ్‌ – పరిశ్రమలు, వాణిజ్యం
దేబశ్రీ చౌదరి – మహిళా శిశు సంక్షేమ శాఖ
రామేశ్వర్‌ తేలి – ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ
కైలాష్‌ చౌదరి – వ్యవసాయం, రైతు, సంక్షేమ శాఖ