ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఇందులో స్వామి నారాయణ్ సంస్థాన్ అధినేత స్వామి మహరాజ్ శతాబ్ధి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, గవర్నర్ హాజరయ్యారు. అహ్మదాబాద్ లోని స్వామి నగర్ లో ఈ శతాబ్ధి ఉత్సవాలు డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు జరగనున్నాయి. భగవాన్ స్వామి నారాయణ శాఖలోని ప్రముఖ సన్యాసి స్వామి మహారాజ్ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ వేడుక కోసం ఏడాది నుంచి సన్నాహాలు చేస్తున్నారు.
బోచ సన్యాసి అక్షర్ పురుషోత్తం, స్వామి నారాయణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల కోసం దాదాపు 80 వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. అహ్మదాబాద్ లోని రింగ్ రోడ్డుపై ఓ భారీ సెట్టింగ్ తో స్వామి నగర్ ను నిర్మించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 60 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి స్వామినారాయణ వర్గానికి చెందిన ప్రజలు హాజరుకానున్నట్లు అంచనా వేస్తున్నారు.

