బాబర్ అజామ్, మిక్కీ ఆర్ధర్ వల్లే పాకిస్థాన్‌కు ఓటములు: హఫీజ్

బాబర్ అజామ్, మిక్కీ ఆర్ధర్ వల్లే పాకిస్థాన్‌కు ఓటములు: హఫీజ్

భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఏదీ కలిసిరావడం లేదు. ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా ఓటములే వెంటాడుతన్నాయి. అంతో ఇంతో ఆ జట్టు విజయాల గురించి చెప్పాలంటే.. భారత్ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లోనే.  ఈ మెగా టోర్నీ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన పాక్..న్యూజిలాండ్ గడ్డపైనా 1-4 తేడాతో టీ20 సిరీస్ ఓడిపోయింది. ఈ ఓటముల నేపథ్యంలో పాక్ డైరెక్టర్ హఫీజ్ బాబర్ అజామ్, మిక్కీ ఆర్ధర్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.     

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్, క్రికెట్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ 2023లో ఆటగాళ్ల ఫిట్‌నెస్ పరీక్షలను నిలిపివేశారని.. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విధంగా ఆడాలని కోరుకుంటున్నారని మహ్మద్ హఫీజ్ అన్నాడు.మేము ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు, వారి ఫిట్‌నెస్ స్థాయిలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆటగాళ్లకు చెప్పాను. ఆటగాళ్ల ఫిట్‌నెస్ గురించి కూడా ట్రైనర్‌ని అడిగాను. అతను ఆరు నెలల క్రితం కెప్టెన్ (బాబర్ ఆజం), క్రికెట్ డైరెక్టర్ (మిక్కీ ఆర్థర్) నాకు ఒక షాకింగ్ విషయం చెప్పాడు. 

ఫిట్‌నెస్ పరిమితులపై ఆటగాళ్లపై ఒత్తిడి పెంచొద్దని..వారు కోరుకున్న విధంగా ఆడనివ్వండి" అని హఫీజ్ ఎ స్పోర్ట్స్‌లో చెప్పాడు. ఆర్థర్ స్థానంలో హఫీజ్  2023 నవంబర్ నుండి జట్టు ప్రధాన కోచ్, డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో, బాబర్ మూడు ఫార్మాట్‌ల నుండి కెప్టెన్‌గా వైదొలిగాడు. కొంతమంది ఆటగాళ్లు 2 కిలోమీటర్లు కూడా పరిగెత్తలేకపోతున్నారని..ఫిట్‌నెస్ అలా ఉంటే పాకిస్థాన్ కు ఓటములు తప్పవని హఫీజ్ హెచ్చరించాడు. పాకిస్థానీ ఆటగాళ్లు ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడుతున్నారు.