నేనే హిందూ పరిరక్షకుడిని అనే అహంకారం వద్దు

నేనే హిందూ పరిరక్షకుడిని అనే అహంకారం వద్దు

తానే హిందూ ధర్మ పరిరక్షకుడిని అనే అహంకారం వద్దన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. నిస్వార్థంగా దేశ సేవ చేయడం ఒక గొప్ప అనుభూతన్నారు. క్షమగుణం భారత్ కు మాత్రమే ఉందని.. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. విష్వగురుగా భారత్ విశ్వాసం పొందుతుందన్నారు. కరోనా నుంచి బయటపడేసే శక్తి భారత్ కు ఉందన్నారు. ప్రపంచానికి మంచి జరగాలంటే భారత్ అఖండ భారత్ అవ్వాలన్నారు. అఖండ భారత్ అవతరించేలా చేయడం భారత పౌరులుగా అందరి బాధ్యతన్నారు. భారత్ నుంచి విడిపోయినప్పటి నుంచి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో సుఖసంతోషాలు లేవన్నారు. విష్వహితమే హిందూ ధర్మమన్నారు . తానే హీరో, తానే హిందూ ధర్మ పరిరక్షకుడిని అనే అహంకారం పనికిరాదని.. వినమ్రతే ముఖ్యమన్నారు. ప్రధానమంత్రే ప్రధాన సేవకుడిని అని చెప్పుకుంటూ తన వినమ్రతను ప్రకటించారని చెప్పారు.